నా రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యపు పార్టీని చూడలేదు
Actor ProfilePolitician

నా రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యపు పార్టీని చూడలేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యపు పార్టీని చూడలేదు
AP7AM27 Nov 2026
నా రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యపు పార్టీని చూడలేదు

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అరాచకాలకు, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకు శాశ్వతంగా చరమగీతం పాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తుంటే, ప్రతిపక్ష వైసీపీ మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. సోమవారం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో నిర్వహించిన భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు.భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంప్రతి నెల 9వ తేదీన భూ సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించి, నేరుగా ప్రజల వద్దకే వచ్చి పట్టాలు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు 7,450 గ్రామాల్లో 32 లక్షల మందికి పైగా రైతులకు అత్యాధునిక భద్రతా ఫీచర్లతో, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందించామని వెల్లడించారు. గత ప్రభుత్వం తమకు ఇష్టం లేని వారి భూములను 22-ఏ జాబితాలో చేర్చి, వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 41 వేల ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి చేసి 25 వేల మంది రైతులకు న్యాయం చేసిందని తెలిపారు. కైకలూరులోనే సుమారు 2,838 ఎకరాలను 1,848 మంది రైతులకు అప్పగించామని చెప్పారు. "మీ భూమిపై మీకే హక్కు ఉండాలి. వేరేవాళ్ల పెత్తనం గానీ, వారి ఫొటోలు గానీ ఉండటానికి వీల్లేదు. ఈ సమస్యను పరిష్కరించే వరకు నేను నిద్రపోను," అని చంద్రబాబు స్పష్టం