నా ఫ్యాన్స్ అలా పచ్చబొట్టు వేయించుకోండి
Actor ProfileActor

నా ఫ్యాన్స్ అలా పచ్చబొట్టు వేయించుకోండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా ఫ్యాన్స్ అలా పచ్చబొట్టు వేయించుకోండి
Chitrajyothy28 Nov 2026
నా ఫ్యాన్స్ అలా పచ్చబొట్టు వేయించుకోండి

సీనియర్ నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు శరత్ కుమార్ తన అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారాయి. సీనియర్ నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు శరత్ కుమార్ (Sarath Kumar) తన అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారాయి. చెన్నైలో తన మద్దతుదారులతో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తన అభిమానులంతా చేతిపై ‘నాట్టామై ఫ్యామిలీ’ (Nattamai Family) అని పచ్చబొట్టు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు రాజకీయపరంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ, తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని, వారి బంధానికి గుర్తుగా ఈ పేరు ప్రతిపాదించానని తెలిపారు. తనను నేరుగా కలవడానికి ఈ పచ్చబొట్టు ఒక ‘గ్రీన్ కార్డ్’ లేదా ప్రత్యేకాధికారం (VIP పాస్) లాగా పనిచేస్తుందని శరత్ కుమార్ పేర్కొన్నారు. చేతిపై ఈ టాటూ ఉన్నవారు ఎవరైనా సరే, ఎటువంటి అడ్డంకులు లేకుండా తన్ను నేరుగా వచ్చి కలవవచ్చని వెల్లడించారు. అయితే ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధన ఏమీ కాదని, ఇష్టం ఉన్నవారు స్వచ్ఛందంగా వేయించుకోవచ్చని స్పష్టం చేశారు. చిత్ర షూటింగ్ నిమిత్తం తనకు సమయం కుదరలేదని, బిజీగా ఉన్న షూటింగ్ షెడ్యూల్ పూర్తవ్వగానే తన చేతిపై కూడా ఈ పచ్చబొట్టును వేయించుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. దేశభక్తిని చాటుకోవడంలోనూ తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపిన శరత్ కుమార్, తన కుడి భుజంపై ఇప్పటికే భారత జాతీయ పతాకాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమిళ చిత్రసీమలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘నాట్టామై’ చిత్రం శరత్ కుమార్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే సినిమా పేరుతో అభిమానులను ‘నాట్టామై ఫ్యామిలీ’గా ఏకం చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టడం, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమవుతోంది. మూడు రోజుల్లో