నేను రెడీ’లో ఎంటర్ టైన్ మెంట్ అదిరిపోతుంది
Actor ProfilePolitician

నేను రెడీ’లో ఎంటర్ టైన్ మెంట్ అదిరిపోతుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేను రెడీ’లో ఎంటర్ టైన్ మెంట్ అదిరిపోతుంది
Telugu Times18 Dec 2026
నేను రెడీ’లో ఎంటర్ టైన్ మెంట్ అదిరిపోతుంది

హవీష్, కావ్య థాపర్ ‘నేను రెడీ’ నుంచి ఎనర్జిటిక్ సాంగ్ ‘మస్తుగుందిరా యవ్వారం’ లాంచ్ యంగ్ హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన రాగా, నర్గీస్ ఫక్రీ ప్రత్యేక పాత్రలో కనిపించిన ఈ పాటలో హవీష్, కావ్య థాపర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే రెండో సింగిల్ ‘మెరుపులే మెరుపులే’ కూడా యూత్‌ను ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ మూడో సింగిల్ ‘మస్తుగుందిరా యవ్వారం’ను విడుదల చేశారు. లైవ్లీ ఫోక్ బీట్స్‌ను క్యాచీ పాప్ సౌండ్స్‌తో కలిపి రూపొందించిన ఈ పాట మొదటి నుంచే ఎనర్జిటిక్ వైబ్‌ను క్రియేట్ చేస్తుంది. మిక్కీ జే. మేయర్ స్వరపరిచిన ఈ పాటలో డ్రమ్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ఆధునిక సింథ్స్, హుక్స్‌ను చక్కగా మిక్స్ చేశారు. దీంతో పాటకు ఫుల్ ఎనర్జీతో కూడిన కమర్షియల్ టచ్ వచ్చింది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం యూత్‌ఫుల్‌గా, సరదాగా, ఫ్లర్టీగా సాగుతూ ప్రేమ, యవ్వనం, యాటిట్యూడ్‌ను ప్రజెంట్ చేస్తోంది. అనురాగ్ కులకర్ణి, మానసి ఎరబతినీ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. విజయ్ పోలాకి కొరియోగ్రఫీ పాటకు మరో హైలైట్‌గా నిలిచింది. మాస్ కమర్షియల్ డ్యాన్స్ స్టెప్స్‌ను ఫోక్ ఫ్యూజన్ మూవ్‌మెంట్స్‌తో మిక్స్ చేసి హై ఎనర్జీతో రూపొందించారు. హవీష్, కావ్య థాపర్ కూడా తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఎనర్జీ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ‘నేను రెడీ’లో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, వీటీవీ గణేష్ తదితరులు కీలక

న న ర డ ల ఎ టర ట న మ ట అద ర ప త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in