నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి
Actor ProfileActor

నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి
NTV Telugu29 Dec 2026
నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి

దివంగత లెజెండరీ నటుడు, ‘రియల్ స్టార్’ శ్రీహరి 62వ జయంతి వేడుకలను బాచుపల్లిలోని మండపం వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి భార్య శాంతి శ్రీహరి, కుమారులు హీరో మేఘాంశ్ శ్రీహరి, శశాంక్ శ్రీహరిలు ఆయన స్మారకానికి ఘన నివాళులు అర్పించారు. ఇదే ప్రాంగణంలో శ్రీహరి కుమార్తె స్వర్గీయ అక్షర స్మారక స్థలం కూడా ఉండటంతో కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు. హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ “ఈరోజు నాన్నగారి 62వ జయంతి. ఆయన ఆశీస్సులతో నేను నటించిన పాన్-ఇండియా చిత్రం ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్‌ను ఈరోజే రిలీజ్ చేశాం. ఈ సినిమా కోసం చిత్ర బృందం అంతా ఎంతో కష్టపడింది. నాన్నగారిని మీరందరూ ఎలాగైతే గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించారో, నన్ను కూడా అలానే ఆశీర్వదించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.” అన్నారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ “శ్రీహరి గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన మంచి పనులు, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మన గుండెల్లో పదిలంగా ఉంటాయి.” అన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అభిమానులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు