నేను కరప్ట్ అయ్యాను
Actor ProfileActor

నేను కరప్ట్ అయ్యాను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేను కరప్ట్ అయ్యాను, నాది నాకే నచ్చడం లేదు.. నాగార్జున సంచలన కామెంట్
Asianet News Telugu24 Dec 2026
నేను కరప్ట్ అయ్యాను, నాది నాకే నచ్చడం లేదు.. నాగార్జున సంచలన కామెంట్

నాగార్జున.. టాలీవుడ్‌లో కింగ్‌గా, మన్మథుడుగా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. సీనియర్లలో అత్యంత ప్రయోగాత్మక చిత్రాలు చేసిన హీరోగా నిలిచారు. గీతాంజలి, శివ, అన్నమయ్య వంటి డిఫరెంట్‌ చిత్రాలు చేశారు. మల్టీస్టారర్స్ చేశారు. ఇటీవల విలన్‌ రోల్స్ కూడా చేస్తున్నారు. రజనీకాంత్‌ `కూలీ`లో ఆయన విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు తన రూట్‌ మారుస్తూ మెప్పిస్తున్నారు. యంగ్‌ జనరేషన్‌ కి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన కింగ్‌ 100లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున ఒకప్పుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తాను కరప్ట్ అయినట్టు చెప్పారు. మీలో మీకు నచ్చని క్వాలిటీ ఏంటి అని ప్రశ్నించినప్పుడు నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. మంచు లక్ష్మి షోలో పాల్గొన్న ఆయన తన జర్నీ గురించి వెల్లడించారు. పిల్లల కెరీర్‌ గురించి స్పందించారు. చైతన్యకి స్వతంత్ర్య భావాలు ఎక్కువ అని, పెద్ద స్థాయికి వెళ్తాడని చెప్పారు నాగార్జున. అన్ని రకాల పనులను మ్యానేజ్‌ చేయడంపై ఆయన రియాక్ట్ అవుతూ, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తానని, ఒకదాంట్లో మరోటి కలుపను అని చెప్పారు. సినిమాలు, పర్సనల్‌ లైఫ్‌ని మిక్స్ చేయను అని వెల్లడించారు. తనకు కూడా కోపం వస్తుందని, అందరిపై అరుస్తానని చెప్పారు. అయితే ముందు తిట్టేసి తర్వాత సారీ చెబుతానని, ఏదో కోపంలో అన్నాను అని చెప్పి సారీ చెబుతానని వెల్లడించారు. సారీ చెబితే చాలా సమస్యలు క్లీయర్‌ అవుతాయని, సారీ చెప్పడంలో ఈగో ప్రాబ్లమ్‌ ఏం లేదన్నారు. ఇప్పుటి తరం కుర్రాళ్లు ప్రయోగాలు చేయడం లేదని, రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలు చేస్తున్నారని వెల్లడించారు. డిఫరెంట్‌ గా చేస్తేనే మంచి సినిమాలు వస్తాయన్నారు. చైతూకి కూడా అదే చెబుతుంటానని వెల్లడించారు. ఈ క్రమంలో మీలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటని మంచు లక్ష్మి అడగ్గా, ఆయన చెప్పలేదు. నచ్చని క్వాలిటీ గురించి అడగ్గా, ఆలోచించి.. `నేను కరప్ట్ అయ్యాను, అదే