నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ! రంగంలోకి సెన్సేషనల్ డైరెక్టర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
Actor ProfileActor

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ! రంగంలోకి సెన్సేషనల్ డైరెక్టర్.. ఫ్యాన్స్ కు పూనకాలే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ! రంగంలోకి సెన్సేషనల్ డైరెక్టర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
TV9 Telugu24 Oct 2026
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ! రంగంలోకి సెన్సేషనల్ డైరెక్టర్.. ఫ్యాన్స్ కు పూనకాలే

నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ప్రకటించారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ మూవీ చర్చల స్థాయిలోనే ఆగిపోయింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ బాగా నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలోనే నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఎప్పుడు వస్తుంది? దర్శకుడు ఎవరు? బాలయ్య కుమారుడు ఎలాంటి కంటెంట్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడని ఆడియెనస్‌ ఎదురు చూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞ డెబ్యూకు సంబంధించి ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే మోక్షు లాంఛింగ్ బాధ్యతలను స్వయంగా బాలకృష్ణనే భుజానకెత్తుకున్నారని తెలుస్తోంది. నందమూరి బ్రాండ్‌కు తగ్గట్టుగా, స్వయంగాఆయనే ఒక పవర్‌ఫుల్ లైన్‌ను సిద్ధం చేసి, స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, ‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా రంగంలోకి దిగినట్లు టాక్ నడుస్తోంది. బాలయ్య సిద్ధం చేసిన స్క్రిప్ట్ కు సందీప్ రెడ్డి మరింత పదును పెడుతున్నట్లు సమాచారం. సాధారణంగా సందీప్ రెడ్డి సినిమాల్లో హీరోలకు భారీగా ఎలివేషన్స్ ఉంటాయి. అలాగే కథనం పంగానూ, ఎమోషనల్ సీన్లను తెరకెక్కించడంలోనూ సందీప్ సిద్ధ హస్తుడు. అందుకే మోక్షు కోసం బాలయ్య కూడా సందీప్ రెడ్డి వంగా లాంటి క్రియేటివ్ డైరెక్టర కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ టాక్ గనుక నిజమైతే, సందీప్ రెడ్డి వంగా ఎంట్రీతో మోక్షజ్ఞ డెబ్యూ గ్రాండ్ గా ఉండనుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాకు క్రేజ్ రావడం ఖాయం. త్వరలోనే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై ఓ అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్

న దమ ర మ క షజ ఞ ఎ ట ర ర గ ల క స న స షనల డ ర క టర ఫ య న స క ప నక ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in