నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం.. వశిష్ట దర్శకత్వంలోనే తొలి సినిమా
Actor ProfileActor

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం.. వశిష్ట దర్శకత్వంలోనే తొలి సినిమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం.. వశిష్ట దర్శకత్వంలోనే తొలి సినిమా
Zee Telugu15 Jan 2027
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం.. వశిష్ట దర్శకత్వంలోనే తొలి సినిమా

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Nandamuri Mokshagna: నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌ ముందుకు సాగలేదు. దీంతో మోక్షజ్ఞ తొలి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మోక్షజ్ఞ తొలి చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. కథ ఇప్పటికే సిద్ధమైనట్లు, ప్రీ-ప్రొడక్షన్‌ పనులను కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను దసరా సందర్భంగా లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. నందమూరి అభిమానుల్లో మోక్షజ్ఞ డెబ్యూపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే కథ, దర్శకుడి ఎంపిక విషయంలో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞను తొలి సినిమాతోనే గ్రాండ్‌గా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి బాలకృష్ణకు గాయం కావడం, ఆ తర్వాత ఆయనకు ఆపరేషన్‌ జరగడం వంటి కారణాలు లేకపోయి ఉంటే మోక్షజ్ఞ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేదని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం, ఇతర సినిమా కమిట్‌మెంట్లను బట్టి మోక్షజ్ఞ సినిమా విషయంలో ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే మోక్షజ్ఞతో వశిష్ట సినిమా, దసరా లాంచ్‌ వంటి అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. గతంలోనూ మోక్షజ్ఞ డెబ్యూపై పలు వార్తలు వచ్చిన నేపథ్యంలో