నితిన్ గడ్కరీతో వైసీపీ
Actor ProfilePolitician

నితిన్ గడ్కరీతో వైసీపీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నితిన్ గడ్కరీతో వైసీపీ, డీఎంకే ఎంపీల భేటీ
Oneindia Telugu10 Dec 2026
నితిన్ గడ్కరీతో వైసీపీ, డీఎంకే ఎంపీల భేటీ

ఏపీ, తమిళనాడులోని రెండు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు.. తిరుపతి- అరుణాచలం (తిరువణ్ణామలై) జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు మరింత వేగవంతం కానుంది. ఈ రహదారిని మరింత ఆధునీకరించి, ఫోర్ లేన్ గా విస్తరించడం వల్ల భక్తుల ప్రయాణ సమయం భారీగా తగ్గడంతో పాటు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే ప్రయత్నాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యులు తెర తీశారు.రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే ఈ ప్రతిపాదనపై వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుపతి, కడప ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి ఈ మధ్యాహ్నం దేశ రాజధానిలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఓ వినతిపత్రాన్ని అందజేశారు. ఆ సమయంలో వారి వెంట డీఎంకేకు చెందిన తిరువణ్ణామలై ఎంపీ సీఎన్ అన్నాదురై కూడా ఉన్నారు. తిరుపతి- తిరువణ్ణామలై రోడ్డు ప్రాముఖ్యత గురించి గడ్కరీకి వివరించారు.తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించడానికి నిత్యం వేలాదిమంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారని ఎంపీలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాల భక్తులకు తిరుపతి- తిరువణ్ణామలై మార్గం ఎంతో కీలకమని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల భక్తులు, ఇతర వాహనదారులు ఈ రహదారిని వినియోగిస్తోన్నారని, ఈ క్రమంలో వాహనాల సంఖ్య అంచనాలకు మించి పెరిగిపోతోందని చెప్పారు.ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌- హాల్ట్ స్టేషన్లుపెరుగుతున్న వాహనాల రాకపోకలకు అనుగుణంగా రహదారిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి, అన్నాదురై.. నితిన్ గడ్కరీకి వివరించారు. ఇప్పుడున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రహదారి విస్తరణ, అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, వాహనదారులకు మెరుగైన భద్రత కల్పించేలా రహదారి ప్రమాణాలను పెంచడం వంటి అంశాలను ఎంపీలు ప్రస్తావించారు.FCRA Bill పై కేంద్రం కీలక నిర్ణయం: ఇక అన్నింటికీ తెర దించినట్టే.. !!ఈ మార్గం అభివృద్ధి చెందితే ఏపీ

న త న గడ కర త వ స ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in