
వచ్చే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో పార్టీ కొత్త కార్యవర్గం కొలువు తీరనుంది. సీజేపీ ఆందోళనల నేపథ్యంలో యువత, మహిళలకు కీలక పదవులు.. యువత, మహిళలకు కీలక పదవులు.. కొందరు కేంద్ర మంత్రులకూ చోటు న్యూఢిల్లీ, ఆగస్టు 16: వచ్చే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో పార్టీ కొత్త కార్యవర్గం కొలువు తీరనుంది. సీజేపీ ఆందోళనల నేపథ్యంలో యువత, మహిళలకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నూతన జట్టును సోమవారం ప్రకటించనున్నారు. కొందరు కేంద్ర మంత్రులకు కూడా ఇందులో చోటు కల్పించనున్నట్లు తెలిసింది. 2029 సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా(ఫిబ్రవరి-మార్చి), గుజరాత్, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్(నవంబరు-డిసెంబరు) రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని నూతన కార్యవర్గాన్ని రూపొందించినట్లు సమాచారం. కొత్త కార్యవర్గ ప్రకటన కాగానే ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేపడతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరిలో జాతీయ సారథ్య బాధ్యతలు చేపట్టిన నబీన్.. కొత్త జట్టు కూర్పు దిశగా అగ్ర నేతలతో పెద్దఎత్తున కసరత్తు జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలతో జాతీయ కార్యవర్గంపై విస్తృతంగా చర్చలు జరిపారు. వాస్తవానికి జూన్‌లో రాజ్యసభ ఎన్నికలు ముగియగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన జరుగుతాయని వార్తలు వచ్చాయి. అయితే నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థుల నిరసనల నేపథ్యంలో వాయిదావేశారు. నబీన్ రాజీనామాతో ఖాళీఅయిన బిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ పరాజయం ఆ పార్టీ నేతలకు భారీ షాకిచ్చింది. 30 ఏళ్లుగా నిరాటంకంగా గెలుస్తున్న స్థానాన్ని, అదీ.. జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన సీటును కోల్పోవడం భవిష్యత్ రాజకీయ మార్పులకు సూచికంటూ రాజకీయ విశ్లేషణలు