
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5 నిర్మాణ సంస్థలు : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్, నటీ నటులు : సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్, సినిమాటోగ్రఫి: నిమిష్ రవి, ఎడిటర్: నవీన్ నూలీ, ప్రొడక్షన్ డిజైన్: బంగ్లాన్, ఆర్ట్స్ డైరెక్టర్స్: శివ కామేశ్, జితూ సెబాస్టియన్, ఫైట్స్: వీ వెంకట్, కొరియోగ్రఫి: విజయ్ బిన్నీ, శేఖర్ మాస్టర్ నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం: వెంకీ అట్లూరి విడుదల తేది : 14.08.2026 నిడివి :2ఘంటల 41నిముషాలు హీరో సూర్య,(Surya) మమితా బైజు (Mamitha Baiju)జంటగా నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Viswanath & Sons). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా నిన్న (ఆగస్టు 14న) తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి విశేష స్పందన లబించింది. మరి రివ్యూ ఎలా వుందో చూద్దామా? కథ : సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒలంపిక్‌లో షూటింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్, సంపన్న కుటుంబానికి చెందిన పారిశ్రామికవేత్త. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోతాడు. అయితే కుటుంబానికి వారసుడు లేడని తల్లి నిర్మలమ్మ(రాధిక శరత్ కుమార్) పెళ్లి చేసుకోమని బలంవంతం చేస్తూ ఉంటుంది. ఆమె ఆవేదనను అర్ధం చేసుకొని సరొగసి ద్వారా కొడుకును కంటాడు. కానీ కొడుకు అభయ్‌కి బోన్ మ్యారో రిప్లేస్‌మెంట్ సర్జరీ అవసరం కావడంతో సరోగసి తల్లి మ్యాడీ (మమితా