నేడు ఏపీ అసెంబ్లీలో చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే
Actor ProfilePolitician

నేడు ఏపీ అసెంబ్లీలో చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేడు ఏపీ అసెంబ్లీలో చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే
Zee Telugu7 Jan 2027
నేడు ఏపీ అసెంబ్లీలో చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Assembly Session Today Agenda: ఆంధ్ర ప్రదేశ్ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ సమావేశం కానుంది. ఈ భేటిలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది. అనంతరం వాటిని సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు శాసన సభ..ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం కానుంది. వడ్డీ లేని రుణ పరిమితి పెంపుతో పాటు స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు.. కొబ్బరి తోటల పరిస్థితి.. ఉన్నతి పథకం .. కాఫీ రైతులకు పరిహారం.. రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు ... విశాఖలో వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు.. గ్రామ పంచాయతీల ఉన్నతీకరణపై సభ్యుల ప్రశ్నలుండన్నాయి. ఇక వెనకబడిన వర్గాలు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై క్యాబినేట్ ఆమోదం తెలపనుంది. అటు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామిని కూడా క్యాబినేట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 24.15 శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి. వాటిని మరో 9.75 శాతం పెంపు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు.. అటు మున్సిపల్ కార్పోరేషన్‌లకు సంబంధించిన మేయర్, మున్సిపల్ చైర్మన్‌లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే బిల్లుకు క్యాబినేట్ ఆమోదం తెలిపి ఉభయ