నీట్ ’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
Actor ProfilePolitician

నీట్ ’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నీట్ ’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
Sakshi24 Nov 2026
నీట్ ’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు

వడకంచెరి: కేరళలోని వడకంచెరికి చెందిన నీట్-యూజీ(NEET-UG) 2024 అభ్యర్థి అంజలి ఎస్ ప్రవేశ పరీక్షలో 640 మార్కులు సాధించినప్పటికీ, ప్రభుత్వ మెడికల్ సీటు పొందలేకపోయానని, ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలో ఏటా రూ. 10 లక్షలు చెల్లించి చదువుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. పరీక్షలో జరిగిన అక్రమాల వల్లే తనకు ఈ దుస్థితి దాపురించిందని ఆమె వాపోయారు. కాగా ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అంజలి ఆరోపించారు. తాము ముందుగా అంచనా వేసిన ర్యాంకులు, లభ్యత ఉన్న సీట్ల ఆధారంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు ఖాయమని ఎంతో ధీమాగా ఉన్నామని, కానీ అనూహ్యంగా ప్రభుత్వ సీటు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్య కోటాలో చేరాల్సి వచ్చిందని, దీనివల్ల తమ కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైఫల్యానికి కారణమైన బాధ్యులు స్పందించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శనివారం ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు అంజలి వెల్లడించారు. నీట్-2024 పరీక్షల వివాదాలు, గ్రేస్ మార్కుల కేటాయింపు వంటి అంశాలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్‌కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్? 'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు) విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సారె సంబరం (ఫొటోలు) విశాఖపట్నంలో అల్లు అర్జున్‌ సందడి (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) పెద్ది ఫ్యామిలీకి కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతిపై వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఈ కేసులో రాజకీయ హస్తం ఉంది..!? ప్రియాంక తండ్రి సంచలన వ్యాఖ్యలు నీ కొడుకుని పదవి నుండి తొలగించు..!? లోకేష్