
మంట తట్టుకోలేక నీళ్లలోనే వారంలో ఐదు రోజులు..! శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఒక విచిత్రమైన, అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పదహారేళ్ల బాలుడి ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒంటి నిండా అనియంత్రిత మంటలు రావడం వల్ల ఆ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆ టీనేజర్ రోజంతా నీళ్లలోనే గడుపుతుండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దాంగా ప్రాంతానికి చెందిన ఇక్బాల్ షేక్ అనే 16 ఏళ్ల కుర్రాడు ఈ వింత పరిస్థితితో నరకయాతన అనుభవిస్తున్నాడు. వారంలో దాదాపు నాలుగైదు రోజుల పాటు ఇతడు నీటిలోనే మునిగి తేలుతుంటాడు. ఒక్కోసారి రాత్రింబవళ్లు తేడా లేకుండా వరుసగా వారం రోజులు కూడా స్థానిక చెరువులోనే ఉండిపోతుండటం విశేషం. బాలుడి వింత ప్రవర్తన గురించి ఆరా తీయగా ఒక దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. నీటి నుంచి బయటకు రాగానే తన శరీరం అంతా విపరీతమైన మంట పుడుతుందని, ఆ తాపాన్ని భరించలేకపోతున్నానని ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం చెరువు నీటిలో ఉన్నప్పుడు మాత్రమే తనకు ఆ మంట నుంచి శమనం లభిస్తుందని చెబుతున్నాడు. గత ఐదేళ్లుగా ఇక్బాల్ జీవితం ఇలాగే సాగుతోందని స్థానికులు తెలుపుతున్నారు. నిరంతరం నీటిలో ఉండటం వల్ల అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. చర్మం దెబ్బతిని వివిధ రకాల చర్మ వ్యాధులు వ్యాపిస్తుండగా, ఎడతెరిపి లేని జలుబు, తీవ్రమైన దగ్గు అతడిని వేధిస్తున్నాయి. అతని ప్రాథమిక వైద్యం కోసం కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వ్యాధి మూలాలను గుర్తించి సరైన చికిత్స అందించడంలో అక్కడి వైద్యులు స్పష్టత ఇవ్వలేకపోయారు. మరొకవైపు, పేదరికంలో ఉన్న ఇక్బాల్ కుటుంబానికి కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించే స్థాయి లేదు