నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కాదు
Actor ProfilePolitician

నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కాదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కాదు
Oneindia Telugu26 Jan 2027
నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కాదు

కాంగ్రెస్ పార్టీలో కొండా సుస్మిత వ్యాఖ్యల దుమారం చిలికి చిలికి గాలివానగా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తన ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయని, తన తండ్రి కొండా మురళికి ఇంతవరకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని, కనీసం కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కొండా సుస్మిత వ్యాఖ్యలపై స్పష్టతఅసలు రెండేళ్ల ముందే పరకాల సీటును అనౌన్స్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కుటుంబం చేసిన అవినీతిని బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని కొండా సురేఖ సమాధానమిచ్చింది. ఈ క్రమంలో కొండా సుస్మిత కూడా తాను చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు.తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదన్న సుస్మితనా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కాదు అని ఆమె స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన సోదరులను విమర్శించానని తెలిపారు.రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకు గౌరవం ఉందని సుస్మిత అన్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు విపరీతమైన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి ఆయనెవరు?అందుకే తాను ఆయన్ను టార్గెట్ చేశానని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి ఆయనకు ఎలాంటి అధికారం ఉందని ప్రశ్నించారు.పరకాల స్థానం నుంచి తాను పోటీ చేస్తానని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమని సుస్మిత స్పష్టం చేశారు. నిన్న రాత్రి ఆమె మరోసారి వివరణ ఇస్తూ, తాను చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖకు ఎలాంటి సంబంధం లేదని, అవి పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయాలని

న ట ర గ ట ర వ త ర డ డ క గ ర స ప ర ట క ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in