
ఆంధ్రప్రదేశ్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీడీఈఈసెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులకు నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కన్వీనర్, పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు వెల్లడించారు. గుంటూరు: ఆంధ్రప్రదేశ్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీడీఈఈసెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కన్వీనర్, పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు (గుంటూరు) బి.లింగేశ్వర రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కళాశాలలో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు. వెబ్ ఆప్షన్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు 17 నుంచి 20 లోపు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24 తేదీ వరకు సంబంధిత డైట్ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి అడ్మిషన్ లెటర్ తీసుకోవాలని సూచించారు. డీఈడీ మొదటి సంవత్సరం తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నట్టు వివరించారు