నాగార్జున కోసం ఏకంగా అలాంటి పాత్ర చేయనున్న టబు
Actor ProfileActor

నాగార్జున కోసం ఏకంగా అలాంటి పాత్ర చేయనున్న టబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాగార్జున కోసం ఏకంగా అలాంటి పాత్ర చేయనున్న టబు
Zee Telugu27 Sept 2026
నాగార్జున కోసం ఏకంగా అలాంటి పాత్ర చేయనున్న టబు

Tabu:అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం కింగ్100 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ప్రముఖ నటి టబు మరోసారి నాగార్జునతో కలిసి నటించనున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఇద్దరూ ప్రేమ జంటగా కనిపించరు. ఈ సినిమాలో టబు ప్రధాన ప్రతినాయకురాలి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పాత్రల్లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాగార్జున, టబు తొలిసారి నిన్నే పెళ్లాడతా సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. వీరి జంటకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆవిడ మా ఆవిడే, సిసింద్రి సినిమాల్లో కూడా కలిసి కనిపించారు. ఆ తరువాత చాలా సంవత్సరాలు ఇద్దరూ ఒకే సినిమాలో నటించలేదు. ఇప్పుడు కింగ్100 సినిమాతో మరోసారి వీరి కలయిక జరగడం విశేషంగా మారింది. ఈ చిత్రానికి దర్శకుడు రా కార్తిక్. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. నాగార్జున 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టబు తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా ఆమె ఎంతో సహజంగా పోషించారు. అందుకే కింగ్100లో ఆమె విలన్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల టబు భూత్ బంగ్లా సినిమాలో నటించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన డ్యూన్: ప్రాఫెసీ సిరీస్‌లో కూడా కనిపించారు. మరోవైపు