నిఖిల్ గొప్ప మనసు.. 1000 మందికి సాయం
Actor ProfileActor

నిఖిల్ గొప్ప మనసు.. 1000 మందికి సాయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిఖిల్ గొప్ప మనసు.. 1000 మందికి సాయం
Chitrajyothy9 Oct 2026
నిఖిల్ గొప్ప మనసు.. 1000 మందికి సాయం

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తన పెద్ద మనసును చాటుకున్నాడు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తన పెద్ద మనసును చాటుకున్నాడు. రక్షాదళ్ మహేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక అద్భుతమైన సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా.. భీమవరంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 1,000 మంది పేద విద్యార్థులకు నిఖిల్ స్వయంగా స్కూల్ కిట్లను పంపిణీ చేశాడు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రిని అందిస్తూ వారి ముఖాల్లో నవ్వులు పూయించాడు. ఈ సందర్భంగా నిఖిల్ పాఠశాల విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా సమయం గడిపాడు. వారితో ముచ్చటిస్తూ.. ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలని, తమలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను, టాలెంట్‌ను గుర్తించి వాటిని మరింత మెరుగుపరుచుకోవాలని ఎంతో ఇన్‌స్పిరేషనల్‌గా మోటివేట్ చేశాడు. జీవితంలో ఎప్పుడూ పెద్ద కలలు కనాలని, వాటిని సాధించే వరకు అస్సలు వెనకడుగు వేయకూడదని పిల్లలకు దిశానిర్దేశం చేశాడు. నిఖిల్ చెప్పిన మాటలు అక్కడున్న విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపాయి. ఇకపై కూడా సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే ఇలాంటి ఎన్నో ఇన్‌స్పిరేషనల్ కార్యక్రమాలకు తన వంతు మద్దతు ఎప్పుడూ ఉంటుందని నిఖిల్ ఈ సందర్భంగా తెలిపాడు. సామాజిక సేవ పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుంటూ.. భవిష్యత్తులోనూ మరిన్ని మంచి పనులతో ప్రజల ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశాడు. భీమవరంలో విద్యార్థులతో నిఖిల్ సందడి చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిఖిల్ చేసిన ఈ గొప్ప పనిపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన స్వయంభు రిలీజ్ కి సిద్దమవుతోంది. ఇది కాకుండా ది ఇండియా హౌస్ సినిమా కూడా షూటింగ్ ని పూర్తిచేసుకొంటుంది

న ఖ ల గ ప ప మనస 1000 మ ద క స య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in