
ఇంటర్నెట్ డెస్క్: విభిన్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక తాజాగా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (Mysaa) చిత్రంలో ఎంతో కష్టమైన అండర్ వాటర్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. భారత చలనచిత్రరంగంలో ఏ హీరోయిన్ ఇప్పటి వరకూ ఇలాంటి అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ చేయలేదని టీమ్ తెలిపింది. దీంతో ఈ సన్నివేశం చేసిన తొలి నటిగా రష్మిక (Rashmika) నిలిచారు. దీనిపై రష్మిక పోస్ట్ పెట్టారు. ‘‘నేను కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలుసు. కానీ ఆ సమయంలో మేమంతా ఈ సీక్వెన్స్‌లో నిమగ్నమై ఉన్నాం. నా కెరీర్‌లో నేను చేసిన వాటిలోకెల్లా ఇది అత్యంత సవాలుతో కూడినది. దీని కోసం చాలా కష్టపడ్డాం. కానీ ఈ అనుభవం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది’’ అని తెలిపారు. ఈ ప్రమాదకరమైన పోరాట ఘట్టాన్ని తను డూప్ లేకుండా స్వయంగా చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. నీటి అడుగున సాగే అత్యంత క్లిష్టమైన ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని ఆమె రెండు రోజుల పాటు దాదాపు 20గంటలు నీటిలో ఉండి పూర్తి చేసిందని తెలిపింది. భారతీయ చలనచిత్ర రంగంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, సినిమాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టంగా ఇది నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. త్వరలోనే ‘మైసా’ టీజర్ (Mysaa Teaser Update) విడుదల కానుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు