
సినిమా అవకాశాల కోసం వెంపర్లాడనని అందుకోసం తన వ్యక్తిగత విలువల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలయాళంలో తొలి సినిమా ‘ప్రేమమ్’ (Premam) తోనే బంపర్ హిట్ కొట్టిన నటి సాయి పల్లవి (Sai Pallavi). ఈ చిత్రంలో మలర్ పాత్రతో ప్రేక్షకుల మనసును కొల్లగొట్టింది. ‘ఫిదా’ మూవీతో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చి ఇక్కడి వారికి ఇంట్లో మనిషిగా మారిపోయింది. అంతేగాక శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ సైతం వచ్చి లేడీ పవర్ స్టార్‌గా అవతరించింది. అనంతరం సాయి పల్లవికి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికే వరుస హిట్ చిత్రాలతో సౌత్ అగ్ర కథానాయికగా తీరిక లేకుండా ఉన్నప్పటికీ తాను స్టార్ అని ఏ మాత్రం అనుకోవడం లేదని సాయి పల్లవి తెలిపింది. పైగా అవకాశాల కోసం వెంపర్లాడనని సినిమాల విషయంలో తన వ్యక్తిగత విలువల గురించి చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఇంటర్వ్యూలో దర్శకులు ఎప్పుడైనా.. ముద్దు సన్నివేశాల్లో నటించమని అడిగారా?.. అలా చేయకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా దానికి సాయిపల్లవి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దానికి ఆమె, "అవును. చాలా మంది దర్శకులు అడిగారు. ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. నేను ముద్దు సన్నివేశాలు చేయనని తెలిసినా అలాంటి ఆఫర్లు ఇంకా వస్తుంటాయి" అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. "నాకు ఒక జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్ ఉండి ఉంటే నటన కోసమైనా ఇంకొకరిని ముద్దు పెట్టుకోవడం నాకు సరైందిగా అనిపించదని అన్నారు. ఒక మనిషికి సంతోషంగా జీవించడానికి మంచి కుటుంబం, ఉండడానికి ఇల్లు, ప్రయాణించడానికి ఒక కారు ఉంటే చాలు. అవన్నీ నాకు ఇప్పటికే ఉన్నాయి. ఇంకో కారు కొనడానికి, లగ్జరీగా ఉండడానికి నేను ఇంకొకరిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఉన్నదానితో నేను సంతోషంగా ఉన్నాను