నా ఓటు తొలగించారు.. నేను మౌనంగా కూర్చోను
Actor ProfileActor

నా ఓటు తొలగించారు.. నేను మౌనంగా కూర్చోను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా ఓటు తొలగించారు.. నేను మౌనంగా కూర్చోను
Chitrajyothy7 Dec 2026
నా ఓటు తొలగించారు.. నేను మౌనంగా కూర్చోను

కర్ణాటకలో ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారని సినీనటుడు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. సినీనటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కర్ణాటకలో జరుగుతున్న ఓటర్ల జాబితా (Karnataka Voter List) సమగ్ర ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా బెంగళూరులో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించినట్లు ఆయన తెలిపారు. ఈ జాబితాలో తన పేరు కూడా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా ప్రకాశ్ రాజ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను పుట్టి పెరిగిన బెంగళూరు (Bengaluru)లోనే తన ఓటు హక్కును తొలగించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన తన పేరునే ఇప్పుడు ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నించారు. బెంగళూరులో సుమారు 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాను మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రకాశ్ రాజ్ కోరారు. తన ఓటు హక్కు విషయంలో జరిగిన పరిణామంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి

న ఓట త లగ చ ర న న మ న గ క ర చ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in