
సూర్య ప్రకాష్ జోశ్యుల వందేళ్ల క్రితం సైతాన్ సింగ్ అనే ఓ సముద్రపు దొంగ (పైరేట్) ఉండేవాడు. వాడు దోచటం, దాచటం తప్పించి అనుభవించింది లేదు. లైఫ్ చివర్లో ఆ సంపదంతా ఓ నిధిగా మార్చి ఓ రహస్య ద్వీపంలో దాచిపెడతాడు.ఎవరు తీసుకుంటారని వాడు దాటి పెట్టాడో కానీ అది అలా చాలా కాలం అనామకంగా అలాగే ఉండిపోయింది. ఇదిగో ఇంతకాలానికి ఆ నిధి కోసం జనాలు బయిలుదేరారు. అయితే నిధి దక్కాలంటే అది ఫలానా చోట ఉందంటే చాలదు కదా..దాన్ని తీసుకుని వచ్చే మ్యాప్, ఆ మ్యాప్ ని డీకోడ్ చేసే బ్యాచ్ ఉండాలి కదా. అలాగే ఈ కాలంలో ఆ నిధి ఎక్కడుందో తెలిపే దారి మాత్రం పృథ్వీ దేశ్‌పాండే (ఉపేంద్ర లిమాయే)కి మాత్రమే తెలుసు. వాడే డీకోడర్ కూడా. అయితే నిథి రహస్యం ఒక్కడితే తెలిస్తే కథేముంటుంది..కిక్కేముంటుంది? కాబట్టి ఈ నిథి గురించి అధూరా (రవి కిషన్) అనే పైరేట్ లీడర్ తెలుసుకుంటాడు. వాడు దాన్ని సొంతం చేసుకుందామనే ఆశతో బయిలుదేరతాడు. అందుకోసం పృథ్వీ దగ్గర ఉన్న మ్యాప్‌ను దొంగిలిస్తాడు. అయితే అది అతని చేతిలో నుంచి పోతుంది. అప్పుడు నిధికి వెళ్లే మార్గం మొత్తం గుర్తున్న పృథ్వీనే కీలకంగా మారిపోతాడు. అంటే ఓరకంగా ఇప్పుడు పృథ్వి అనేవాడు నడిచే గూగల్ మ్యాప్ అన్నమాట. అక్కడితో ఈ ట్రెజర్ హంట్ ప్రారంభం కాదు... ఈ నిథి గురించి గుడ్డూ (అజయ్ దేవగన్), తన స్నేహితుడు జానీ (సంజయ్ మిశ్రా)కి లీక్ అవ్వటంతో వాళ్లూ బయిలుదేరతారు. వీళ్లతో పాటు ఫ్యామిలీ ప్యాక్ అతని గర్ల్‌ఫ్రెండ్ ఆలియా (ఈషా గుప్తా), ఆమె ఇద్దరు పిల్లలు కూడా ప్రయాణంలో చేరతారు. వీళ్లు చాలదన్నట్లు ఆది (అర్షద్ వార్సి), అతని సోదరుడు మానవ్ (జావేద్ జాఫేరి), ఆది భార్య రోజీ (సంజీద షేక్)లకు కూడా ఆ నిధి తెలుస్తుంది. వాళ్లు రెడీ. మరోవైపు, కోటీశ్వరుడు కూతురని