నవంబర్ లోనే అనిరుధ్
Actor ProfileActor

నవంబర్ లోనే అనిరుధ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నవంబర్ లోనే అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి?... ఇరు కుటుంబాల గ్రీన్ సిగ్నల్
Samayam Telugu6 Nov 2026
నవంబర్ లోనే అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి?... ఇరు కుటుంబాల గ్రీన్ సిగ్నల్

సంగీత సంచలనం, కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారనే ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంచైజీ ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ సీఈవో, సన్ నెట్‌వర్క్ వారసురాలు కావ్య మారన్‌తో ఆయన ఏడడుగులు వేయబోతున్నారంటూ తమిళ మీడియా వర్గాల్లో కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. తమ బంధాన్ని వారిద్దరు ఖండించకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరి వివాహం ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో జరిగే అవకాశం ఉందంటూ నెట్టింట సరికొత్త చర్చ నడుస్తోంది. అనిరుధ్, కావ్య మారన్ రిలేషన్‌లో ఉన్నారంటూ గతంలోనూ పలుమార్లు రూమర్స్ వినిపించినప్పటికీ.. ఇరు వర్గాలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అనిరుధ్ బాబాయ్, కోలీవుడ్ సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ పెళ్లి వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. నాకు తెలిసినంత వరకు వీరిద్దరి వివాహం దాదాపు ఖాయమైందని, ఇది ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో జరగబోతున్న ఒక భారీ వెడ్డింగ్ అని ఆయన పేర్కొన్నారు. కావ్య మారన్ ఎంతో సమర్థురాలని, అనిరుధ్-కావ్యల జంట ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆయన ప్రశంసించడంతో ఈ వార్త నిజమేనని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.* నాగార్జున, చైతూలతో కలిసి అఖిల్ మల్టీస్టారర్?... ‘లెనిన్’ జోష్‌తో అక్కినేని హీరోల బిగ్ ప్లాన్!‘జైలర్-2’ విడుదల తర్వాతే వివాహం? సన్ పిక్చర్స్ నిర్మించిన ‘బీస్ట్’, ‘జైలర్’ వంటి భారీ చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాల షూటింగ్, ప్రమోషన్స్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిందని ఇండస్ట్రీ టాక్. తాజా సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జైలర్-2’ అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ హడావిడి పూర్తయిన వెంటనే నవంబర్ రెండో వారంలో ఈ క్రేజీ జంట