నల్లబజారుకు వంటింటి గ్యాస్
Actor ProfilePolitician

నల్లబజారుకు వంటింటి గ్యాస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నల్లబజారుకు వంటింటి గ్యాస్
Eenadu26 Dec 2026
నల్లబజారుకు వంటింటి గ్యాస్

ఒంగోలు 60 అడుగుల రోడ్డులోని ఓ దుకాణంలో వినియోగిస్తున్న గృహ అవసరాల సిలిండర్లు వంటింటి గ్యాస్‌ నల్లబజారుకు తరలుతోంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా గృహ అవసరాల సిలిండరు రూ.2 వేల చొప్పున బయట మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఏజెన్సీల సహకారంతో గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌...హోటళ్లు, రెస్లారెంట్ల నిర్వాహకులతో కుమ్మక్కై దందా కొనసాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రస్తుతం ఆయిల్‌ కంపెనీల ధరల ప్రకారం వాణిజ్య సిలిండరు రూ.2,975, గృహ అవసరాల సిలిండరు రూ.987 ఉంది. ప్రధానంగా ఒంగోలుతోపాటు, మార్కాపురం, కందుకూరు, అద్దంకి, గిద్దలూరు, చీమకుర్తి, కనిగిరి, పొదిలి, దర్శి తదితర ప్రాంతాల్లో బయట మార్కెట్‌లో గృహ అవసరాల సిలిండర్లకు డిమాండు ఏర్పడింది. వాణిజ్య సిలిండర్ల ధర ఎక్కువ కావడంతో టీ దుకాణ నిర్వాహకుల నుంచి వ్యాపార అవసరాల నిమిత్తం వంట గ్యాస్‌ సిలిండర్లపైనే ఆధారపడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఐవోసీ, హెచ్‌పీ, బీపీసీ కంపెనీలకు సంబంధించి మొత్తం 64 గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా వాటి పరిధిలో 8,74,038 గృహ అవసర కనెక్షన్లు మరో 9 వేలు వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. ఒంగోలుతోపాటు, అన్ని మండల కేంద్రాల్లో హోటళ్లు, టీ స్టాళ్లు, అల్పాహార దుకాణాల సంఖ్యకు వాణిజ్య కనెక్షన్లకు పొంతనే లేదు. గృహ అవసరాలకు వాడాల్సిన సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. పేరుకు ఒకటి, రెండు వాణిజ్య సిలిండర్లు వాడుతున్నా...ఎక్కువగా వంట గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తక్కువ ఉండనున్న నేపథ్యంలో సదరు వినియోగదారులను గుర్తించిన ఏజెన్సీ నిర్వాహకులు, డెలివరీ బాయ్స్‌ వారి పేరు మీద బుక్‌ చేసి వారి సిలిండర్లను నల్లబజారుకు తరలిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన విధానం ద్వారా ఓటీపీ అమల్లోకి తీసుకొచ్చింది. సదరు సమాచారాన్ని చెప్పినందుకు వినియోగదారులకు కూడా రూ.500 ఇస్తున్నారు. నిబంధనల మేరకు వ్యాపార అవసరాలకు వాణిజ్య సిలిండర్లను వినియోగించాలి. రెస్టారెంట్లు, హోటళ్లలో వాడే గృహ అవసరాల సిలిండర్లను కట్టడి చేయాల్సిన పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఆ

నల లబజ ర క వ ట ట గ య స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in