
ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ బుధవారం హాజరయ్యారు. విజయవాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ ఈరోజు(బుధవారం) హాజరయ్యారు. ఈ కేసులో జత్వానీ సోదరుడు, తల్లిదండ్రులు పేర్లు తొలగించటంపై లిఖిత పూర్వకంగా తన అభ్యంతరాలను సీఐడీ కోర్టుకు విద్యాసాగర్ అందజేశారు. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి సీఐడీ కోర్టు వాయిదా వేసింది. తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూల్ చేయటంతో జత్వానీ తల్లిదండ్రులు, తమ్ముడి పాత్ర ఉందని కుక్కల విద్యాసాగర్ వెల్లడించారు. కొంత డబ్బును జత్వానీ తల్లి ఆశా జత్వానీ అకౌంట్‌కు బదిలీ చేశానని తెలిపారు. కొన్నిసార్లు జత్వానీ తల్లి ఫోన్ చేసి తన కుమార్తె చెప్పినట్లుగా చేయాలని లేకపోతే ఇబ్బంది పడతావని బెదిరించిందని అన్నారు. దుబాయ్‌లో ఉన్న జత్వనీ సోదరుడు అంబరీష్ కి నేరగాళ్లతో సంబంధం ఉందని బెదిరించారని చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురిని కేసు నుంచి తీయటానికి అనుమతించవద్దని కుక్కల విద్యాసాగర్ కోరారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు