ధర్మన్’ సెట్స్ లో రజనీకాంత్ కు ఘన సత్కారం
Actor ProfileActor

ధర్మన్’ సెట్స్ లో రజనీకాంత్ కు ఘన సత్కారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ధర్మన్’ సెట్స్ లో రజనీకాంత్ కు ఘన సత్కారం
Chitrajyothy28 Dec 2026
ధర్మన్’ సెట్స్ లో రజనీకాంత్ కు ఘన సత్కారం

భారతీయ సినీ చరిత్రలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ది ప్రత్యేకమైన స్థానం. ఆగస్టు 15 ఆయన సినీ ప్రయాణంలో మరుపురాని రోజు. భారతీయ సినీ చరిత్రలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ది (Rajinikanth) ప్రత్యేకమైన స్థానం. ఆగస్టు 15 ఆయన సినీ ప్రయాణంలో మరుపురాని రోజు. 1975లో ఇదే రోజున రజనీకాంత్‌ నటించిన తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన తమిళ ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత దశాబ్దాల పాటు తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌, నటనతో భారతీయ చిత్రసీమలో తిరుగులేని సూపర్‌స్టార్‌గా ఎదిగారు. తొలి సినిమా విడుదలై 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజనీకాంత్‌ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ‘ధర్మన్’ చిత్రబృందం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. సినిమా షూటింగ్‌ జరుగుతున్న సెట్స్‌లో రజనీకాంత్‌ సమక్షంలో కేక్‌ కటింగ్‌ చేసి ఆయనకు ఘనంగా సత్కారం చేశారు. ఈ వేడుకలో ‘ధర్మన్’ దర్శకుడు అశ్వత్ మారిముత్తు, కథానాయికలు సిమ్రన్, రాశీ ఖన్నాతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. రజనీకాంత్‌తో కలిసి కేక్‌ కట్‌ చేసి ఆయన 51 ఏళ్ల అద్భుతమైన సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ నటుడు కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది

ధర మన స ట స ల రజన క త క ఘన సత క ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in