దేశ భద్రత కోసం పుట్టి
Actor ProfilePolitician

దేశ భద్రత కోసం పుట్టి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేశ భద్రత కోసం పుట్టి, అసమ్మతి గొంతు నొక్కే ఆయుధంగా మారిందా
Oneindia Telugu26 Sept 2026
దేశ భద్రత కోసం పుట్టి, అసమ్మతి గొంతు నొక్కే ఆయుధంగా మారిందా

ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna Ravan) పై అత్యంత ప్రమాదకర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రావణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసులు వరుసగా నాలుగు సార్లు అరెస్టులు చేయడం,, కోర్టులు బెయిల్ ఇవ్వడం జరిగిపోయాయి. దీంతో ఈసారి బెయిల్ రాకుండా ఏకంగా ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి నెల్లూరు జైలుకు రిమాండ్ పై పంపారు. ఈ నేపథ్యంలో జాతీయ స్ధాయిలో మరోసారి ఉపా చట్టం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటీ ఉపా చట్టం, అసలు ఇది ఎందుకు పుట్టుకొచ్చింది, ఇప్పుడెలా మారిపోయిందా ఓసారి చూద్దాం..ఉపా చట్టం నేపథ్యం (UAPA)భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రతిపాదించిన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (UAPA) కాలక్రమేణా తీవ్రమైన మార్పులకు లోనైంది. 2004లో వివాదాస్పద పోటా (POTA) చట్టాన్ని రద్దు చేసిన తర్వాత, యూఏపీఏను దేశంలో ప్రధాన ఉగ్రవాద నిరోధక చట్టంగా తీర్చిదిద్దారు. నాటి నుండి నేటి వరకు కేవలం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఉద్దేశంతో సాగిన ఈ చట్ట ప్రయాణం, క్రమంగా భిన్నాభిప్రాయాలను అణచివేసే సాధనంగా ఎలా రూపాంతరం చెందిందనే అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. Prasna Ravan: అరెస్టు-బెయిల్ మధ్య రావణ్..! తగ్గని పోలీసులు-మధ్యలో జనసేన..!చట్టాల్లో కీలక మార్పులు ఈ చట్టం పరిధిని పెంచేందుకు 2004 నుండి పలుమార్లు కీలక సవరణలు చేశారు. ముఖ్యంగా 2008 ముంబై దాడుల అనంతరం, అలాగే 2012, 2019లలో తీసుకొచ్చిన మార్పులు ఈ చట్టానికి మరింత పదును పెట్టాయి. ప్రారంభంలో కేవలం నిషేధిత సంస్థలపై చర్యలు తీసుకోవడానికే పరిమితమైన యూఏపీఏను, 2019 సవరణ ద్వారా ఏ గుంపుతోనూ సంబంధం లేకపోయినా ఒక వ్యక్తిని నేరుగా ఉగ్రవాది’గా ప్రకటించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పించారు.

ద శ భద రత క స ప ట ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in