
దేవాలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఆలయాల్లో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా, జులై 12 (ఆంధ్రజ్యోతి): దేవాలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ (Telangana Minister Konda Surekha) వ్యాఖ్యానించారు. ఆలయాల్లో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) వరంగల్ సిటీలో మంత్రి కొండా సురేఖ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వరంగల్ మేయర్ సీటు గెలుపు కోసం పార్టీ శ్రేణులు గ్రౌండ్ వర్క్ చేయాలని కొండా సురేఖ సూచించారు. బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి.. భూగర్భ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
