
కర్నూలు టౌన్(ఈటీవీ): దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి వేడుకలను ఆదివారం కర్నూలులో నిర్వహించారు. నగరంలోని కిసాన్ ఘాట్‌లో తెదేపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొని దివంగత నేతకు నివాళులర్పించారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వస్తున్న యువత కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేయాలనే ఆలోచనను రాజకీయ నాయకులు మానుకోవాలన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు