ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్ కు కలిసి వస్తుందా
Actor ProfileActor

ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్ కు కలిసి వస్తుందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్ కు కలిసి వస్తుందా
123Telugu17 Dec 2026
ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్ కు కలిసి వస్తుందా

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు గత కొన్నేళ్లుగా చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ, పలు అవకాశాలను తిరస్కరిస్తూ వచ్చారు. ‘బుజ్జిగాడు’, ‘యమదొంగ’, ‘మహానటి’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల ఘట్టమనేని వారసుడు జయకృష్ణ అరంగేట్ర చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’లో ఆయన కీలక పాత్ర పోషించినప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచింది. అందులో మోహన్ బాబు క్యారెక్టర్ డిజైన్ అరకొరగానే ఉండటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. వరుసగా ప్రాజెక్టులను తిరస్కరించి, ఇలాంటి ప్లాప్ సినిమాను ఎంచుకోవడంపై ట్రేడ్ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు ఒక అత్యంత కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కథను మలుపు తిప్పేదిగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మోహన్ బాబు ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రాగా, నటుడిగా ఆయన కెరీర్‌కు ఈ చిత్రం చాలా కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మాణంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది

ద ప య రడ జ ఆ స న యర య క టర క కల స వస త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in