దాదా' సౌరవ్ గంగూలీ బయోపిక్.. ఫస్ట్ లుక్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే
Actor ProfileActor

దాదా' సౌరవ్ గంగూలీ బయోపిక్.. ఫస్ట్ లుక్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దాదా' సౌరవ్ గంగూలీ బయోపిక్.. ఫస్ట్ లుక్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే
10TV Telugu8 Oct 2026
దాదా' సౌరవ్ గంగూలీ బయోపిక్.. ఫస్ట్ లుక్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే

Sourav Ganguly : భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు సౌరవ్ గంగూలీ, టీమిండియాను దూకుడైన జట్టుగా తీర్చిదిద్దిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. భారత క్రికెట్‌కు కొత్త దిశ చూపించిన కెప్టెన్‌గా దాదా సౌరవ్ గంగూలీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆటగాడిగా, కెప్టెన్‌గా, అనంతరం నిర్వాహకుడిగా భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారు గంగూలీ. ఇప్పటికే పలు క్రికెటర్స్ పై బయోపిక్స్ రాగా ఇప్పుడు గంగూలీ బయోపిక్ రానుంది. తాజాగా సౌరవ్ గంగూలీ బయోపిక్ దాదా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ ఈ బయోపిక్ ని ప్రకటించారు. ఈ సినిమాలో సౌరవ్ గంగూలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ లో గంగూలీ జెర్సీ తీసేసి గాల్లో ఊపుతూ రచ్చ చేసిన ఫొటోని చూపించారు. Also See : Jaanvi Swarup : మహేష్ బాబు మేనకోడలు లేటెస్ట్ ఫొటోలు చూశారా? జాన్వీ స్వరూప్ బోల్డ్ లుక్స్.. సౌరవ్ గంగూలీ బయోపిక్ దాదా సినిమా 2027 మే 14న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మాణంలో విక్రమాదిత్య మొత్వానే దర్శకత్వంలో తెరకెక్కుతుంది. గంగూలీ ఈ ఫస్ట్ లుక్ ని తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మరి గంగూలీ బయోపిక్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. The Best Gift Ever! Can’t wait to see you play my cover drive! #RajkummarRao#Dada #DadaTheSouravGangulyStory #DadaFirstLook — Sourav Ganguly (@SGanguly99) July 8, 2026