
Eenadu•11 Jan 2027
దండులా కదిలి.. ప్రాణాలు కాపాడిమిజోరంలోని ఖావ్‌కావ్ గ్రామంలో ఓ థార్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. మారుమూల ప్రాంతం కావడంతో రెస్క్యూ బృందాలు అందుబాటులో లేవు. దీంతో ఆ గ్రామస్థులే రక్షకులుగా మారారు. ఖావ్‌కావ్ యంగ్ మిజో అసోసియేషన్, పురుషులు, మహిళలు కలసి వాహనానికి తాళ్లు కట్టి లాగడం మొదలుపెట్టారు. కానీ, చెట్లు, రాళ్లు అడ్డుగా ఉండటంతో వాహనాన్ని బయటకు తీయడం సవాలుగా మారింది. అయినా అంతా కలసి పట్టు వదలకుండా వాహనాన్ని బయటకు తీశారు. దీంతో డ్రైవర్ చిన్నగాయాలతో బయటపడ్డాడు. ఈ వార్త చదివారా: పసిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు టీవీకే ఎమ్మెల్యే