
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. VV Vinayak Launches Venkatramayya Taluka 3rd Song: కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను హృద్యంగా ఆవిష్కరిస్తూ తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలుకా’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి టీజర్ సహా అన్ని ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రాన్ని ఈనెల 17 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం నుంచి మూడో గీతం ‘ఆడుకున్న దిక్కడే’ లిరికల్ సాంగ్‌ను స్టార్ దర్శకుడు వి.వి. వినాయక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతేకాదు ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, "ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వాటికి విశేషమైన స్పందన లభిస్తోంది. ఇప్పుడు విడుదల చేసిన *ఆడుకున్న దిక్కడే* పాట కూడా ప్రతి ఒక్కరిని హృదయానికి హత్తుకునేలా ఉంది. యూత్ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో పాటలున్నాయి. కథలోని భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ గీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హీరో దినేష్ కుమార్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న దివిజ ప్రభాకర్ జంటగా యాక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల డైరెక్ట్ చేస్తున్నాడు. కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, తల్లిదండ్రుల