దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
Actor ProfileActor

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources3
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
AP7AM30 Oct 2026
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రముఖ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జీవితం, సమాజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో శనివారం నిర్వహించిన రాష్ట్ర ప్రసూతి, గైనకాలజిస్టుల 11వ వార్షిక మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో ఆలోచనాత్మకమైన సమాధానాలిచ్చారు."ప్రపంచంలో యుద్ధాల వెనుక కులం, మతం, ప్రాంతం వంటి కారణాలు ఉండవని, కేవలం వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా ఉంటాయని" త్రివిక్రమ్ విశ్లేషించారు. సహజ వనరులు, ఖనిజాల కోసమే ప్రధానంగా యుద్ధాలు జరుగుతాయని, ప్రేమ వంటి భావోద్వేగాల వల్ల ఘర్షణలు తలెత్తుతాయనడం కేవలం భ్రమ అని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుత కాలంలో ప్రతి అంశం ద్రవ్యంతో ముడిపడి ఉందని, ఆర్థిక ప్రాధాన్యతను గుర్తించక తప్పదని త్రివిక్రమ్ పేర్కొన్నారు. జీవితంలో తప్పులు, అప్పులు లేని వారు ఎవరూ ఉండరని చెబుతూ, "చిన్న చిన్న తప్పిదాలే జీవితానికి పరిపూర్ణతను, అందాన్ని ఇస్తాయి" అని వ్యాఖ్యానించారు. తాము పరిపూర్ణులమనే అహంభావం ఎవరికీ తగదని ఆయన హితవు పలికారు.వైద్య వృత్తిలోని సవాళ్లను, ముఖ్యంగా లేబర్ రూమ్‌లలో గైనకాలజిస్టులు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమాల్లో వైద్యులను ప్రతికూల కోణంలో చూపిస్తున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ.. వారికి గట్టి సంఘాలు లేకపోవడమే అందుకు కారణమని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మహాసభకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 2,000 మంది వైద్యులు హాజరయ్యారు

త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్
Chitrajyothy24 Oct 2026
త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ మధ్య ఇప్పుడు వార్ జరగబోతోంది. అదేంటి అనుకుంటున్నారా? నిజంగా వారేం యుద్ధం చేసుకోవడం లేదులే కానీ, వారు చేయబోతోన్న చిత్రాల

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు తమిళ సెగ
AP7AM23 Sept 2026
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు తమిళ సెగ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే పెను వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథాంశంపై తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత

వెంకీ, త్రివిక్రమ్ ఏకే 47’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
Chitrajyothy3 Aug 2026
వెంకీ, త్రివిక్రమ్ ఏకే 47’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

విక్టరీ వెంకటేష్ హీరోగా.. మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. విక్టరీ వెంకటేష్ (Victory

తండ్రి గురించి గొప్పగా చెప్పిన త్రివిక్రమ్.. వింటే మనసు బరువెక్కుతుంది భయ్యా
TV9 Telugu26 Jun 2026
తండ్రి గురించి గొప్పగా చెప్పిన త్రివిక్రమ్.. వింటే మనసు బరువెక్కుతుంది భయ్యా

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి పాత్ర, ఆయన సమాజానికి, కుటుంబానికి అందించే సహకారం గురించి ఒక భావోద్వేగ ప్రసంగం చేసిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో

దర శక డ త ర వ క రమ శ ర న వ స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in