తొలిసారి అలాంటి మాటలు విన్నాను.. స్టేజ్
Actor ProfileActor

తొలిసారి అలాంటి మాటలు విన్నాను.. స్టేజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తొలిసారి అలాంటి మాటలు విన్నాను.. స్టేజ్ పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
TV9 Telugu19 Sept 2026
తొలిసారి అలాంటి మాటలు విన్నాను.. స్టేజ్ పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్

వర్సటైల్ యాక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన సత్యదేవ్ ఆతర్వాత హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రావు బహుదూర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏ,ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి అండ్ శరత్ చంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రావు బహుదుర్ సినిమాలో సత్యదేవ్ తన నటనతో ప్రేక్షకులను వ్ విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో దీపా థామస్ హీరోయిన్ గా నటించింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో తొలి సినిమా అయినప్పటికీ తన నటనతో అలరించింది దీపా థామస్. తాజాగా రావు బహదూర్ మూవీ టీమ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో హీరోయిన్ దీపా థామస్. మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. 9 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. కానీ ఈ సినిమా అవకాశం రావడంతో కల నిజమైంది. ఈ సినిమా ఛాన్స్ రావడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమాలో సత్యదేవ్ లాంటి బ్రిలియంట్ యాక్టర్