తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు
Actor ProfileActor

తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు
Telugu Cinema24 Oct 2026
తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి, లిప్‌లాక్ సీన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెరపై లిప్ కిస్ సన్నివేశాలకు తను పూర్తి దూరం అనే విషయాన్ని దర్శకులకు ముందే స్పష్టంగా చెబుతానంటోంది సాయి పల్లవి.అయినప్పటికీ కొంతమంది తనను ముద్దు గురించి అడుగుతుంటారని, అలా ఎలా అడుగుతారో అస్సలు అర్థం కాదంటోంది. ఒకవేళ తనకు ఒక బాయ్‌ఫ్రెండ్ లేదా భాగస్వామి ఉంటే, అది కేవలం నటన కోసమే అయినా సరే.. వేరే వ్యక్తిని ముద్దు పెట్టడం నైతికంగా కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సాయిపల్లవి. ఎంతమంది డైరెక్టర్లు అడిగినా తన రూల్ మార్చుకునే ప్రసక్తే లేదని చెబుతోంది. ఒక మనిషి సంతోషంగా బతకడానికి ఒక ఇల్లు, కారు, ప్రశాంతమైన కుటుంబం ఉంటే చాలని.. దేవుడి దయ తనకు అవన్నీ ఉన్నాయంటోంది సాయిపల్లవి. కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కోసం తన మనస్సాక్షిని చంపుకొని ముద్దు సీన్లలో నటించాల్సిన అవసరం తనకు లేదంటోంది

త ల స క డ మ ద ద అడ గ త ట ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in