తాలిబాన్ మంత్రి ఇంటర్వ్యూ... అమెరికాకు చురకలు
Actor ProfilePolitician

తాలిబాన్ మంత్రి ఇంటర్వ్యూ... అమెరికాకు చురకలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తాలిబాన్ మంత్రి ఇంటర్వ్యూ... అమెరికాకు చురకలు, పాకిస్థాన్ కు హెచ్చరిక, భారత్ కు స్నేహహస్తం
AP7AM6 Oct 2026
తాలిబాన్ మంత్రి ఇంటర్వ్యూ... అమెరికాకు చురకలు, పాకిస్థాన్ కు హెచ్చరిక, భారత్ కు స్నేహహస్తం

ఆఫ్ఘనిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి తమ అధీనంలోకి తీసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరికను తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా తిరస్కరించింది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలను విస్తరించుకోవడానికి ఆసక్తిగా ఉన్నామని సంకేతాలిచ్చింది.ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాలిబన్ సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి ముహాజిర్ ఫరాహీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికా తిరిగి పొందడం కేవలం "కలల్లోనే సాధ్యం" అని ఆయన స్పష్టం చేశారు. 2021లో అమెరికా సేనలు వెనక్కి వెళ్లాక బగ్రామ్ స్థావరం తాలిబన్ల ఆధీనంలోకి వచ్చింది. చైనాకు సమీపంలో వ్యూహాత్మకంగా కీలకమైన ఈ స్థావరాన్ని తిరిగి పొందాలని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు.పాకిస్థాన్‌తో పెరుగుతున్న ఘర్షణలపై ఫరాహీ తీవ్రంగా స్పందించారు. ఇటీవల పాక్ చర్యలకు తాము బలమైన సమాధానం ఇచ్చామని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఏ స్థాయి వరకైనా వెళతామని హెచ్చరించారు. జూన్ చివరిలో ఆఫ్ఘన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 38 మంది పౌరులు మరణించారని ఆఫ్ఘన్ అధికారులు ఆరోపించగా, 29 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ ప్రకటించింది.మరోవైపు, భారత్‌తో తమకు చారిత్రక సంబంధాలు ఉన్నాయని ఫరాహీ గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. తరచూ సరిహద్దులు మూసివేస్తున్న పాకిస్థాన్‌పై ఆధారపడకుండా ఇరాన్, భారత్, చైనా ద్వారా వాణిజ్య మార్గాలను విస్తరించుకుంటున్నామని తెలిపారు. కాబుల్‌లో అమెరికాపై సాధించిన

త ల బ న మ త ర ఇ టర వ య అమ ర క క చ రకల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in