తెలుగు సినిమాల్లో పెరుగుతున్న బాలీవుడ్ నటులు
Actor ProfileActor

తెలుగు సినిమాల్లో పెరుగుతున్న బాలీవుడ్ నటులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగు సినిమాల్లో పెరుగుతున్న బాలీవుడ్ నటులు
Chitrajyothy26 Nov 2026
తెలుగు సినిమాల్లో పెరుగుతున్న బాలీవుడ్ నటులు

ఒకప్పటి కంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ కనిపించడం ఎక్కువయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకూ తెలుగులో నటించని బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నారట. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ మూవీస్ లో నటించిన బాలీవుడ్ నటులపై సినీ ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ లోనే హిందీ హీరో షాహిద్ కపూర్ ఓ కీలక పాత్ర ధరించనున్నారని వినికిడి. ఈ చిత్రాన్ని పౌరాణిక గాథతో తెరకెక్కిస్తారనీ సమాచారం. ఇలా పలు విశేషాలను ఇప్పటి నుంచే అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందే ప్రాజెక్ట్ అందిపుచ్చుకుంటోంది. అదే అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. షాహిద్ కపూర్ ఇప్పటి దాకా తెలుగు చిత్రాల్లో నటించలేదు. అయితే తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్దేశకత్వంలో షాహిద్ నటించిన 'కబీర్ సింగ్' బిగ్ హిట్ గా నిలచింది. అలాగే తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన 'జెర్సీ' సినిమాలోనూ షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రం కూడా తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం.అయితే 'జెర్సీ' బాక్సాఫీస్ బాంబ్ గా మిగిలింది. తెలుగు చిత్రసీమకు, బాలీవుడ్ హీరోస్ కు అనుబంధం ఏ నాటి నుంచో ఉంది. ఆ మాటకొస్తే తెలుగు భాషలో హిందీ సినిమాలను డబ్బింగ్ చేసి సక్సెస్ సాధించిన వారూ ఉన్నారు. నాటి మేటి నటుడు రాజ్ కపూర్ తన 'ఆహ్' చిత్రాన్ని 1953లోనే తెలుగులో 'ప్రేమలేఖలు'గా డబ్ చేసి విజయం సాధించారు. ఆ పై విజయా ప్రొడక్షన్స్, సురేశ్ ప్రొడక్షన్స్, పద్మాలయా, ప్రసాద్ ప్రొడక్షన్స్ వంటి సంస్థలు పలు హిందీ చిత్రాలు నిర్మించి ఉత్తరాదిన జయకేతనం ఎగురవేశాయి. అంతకు ముందు తెలుగు నిర్మాతలు నిర్మించిన హిందీ చిత్రాల్లో పలువురు హిందీ హీరోలు నటించి

త ల గ స న మ ల ల ప ర గ త న న బ ల వ డ నట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in