తెలుగు రాష్ట్రాల్లో మొదలైన అవెంజర్స్’ క్రేజ్.. రిలీజ్ కు ముందే భారీ హైప్
Actor ProfileCelebrity

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన అవెంజర్స్’ క్రేజ్.. రిలీజ్ కు ముందే భారీ హైప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన అవెంజర్స్’ క్రేజ్.. రిలీజ్ కు ముందే భారీ హైప్
Chitrajyothy8 Jan 2027
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన అవెంజర్స్’ క్రేజ్.. రిలీజ్ కు ముందే భారీ హైప్

మ‌రో నాలుగు నెల‌ల్లో రానున్న‌‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే భారీ క్రేజ్ మొదలైంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ (Hollywood Movies) సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో మంచి క్రేజ్ ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిన విష‌యమే. ముఖ్యంగా మార్వెల్ (Marvel Movies) సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా మరోసారి ఆ సందడి మొదలైంది. మార్వెల్ అభిమానులకు మరోసారి పెద్ద పండగ రాబోతోంది. అయితే ఎప్పుడైని సినిమా రిలీజ్ రెండు మూడు రోజులు ఉంద‌న‌గా మ‌న ద‌గ్గ‌ర హ‌డావుడి అంత‌కంత‌కు పెరుగూ పోయేది. కానీ ఇప్పుడు అంతా సీన్ రివ‌ర్స్ అయి స్టెయిట్ సినిమాల మాదిరి రెండు మూడు నెల‌ల ముందు నుంచే హాలీవుడ్ సినిమాల విష‌యంలో ఫ్యాన్స్ ర‌చ్చ మొద‌ల‌వుతోంది. ఇప్ప‌టికీ ఇంకా ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మేనియా పూర్తిగా తగ్గకముందే.. ఇప్పుడు అందరి చూపు ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ (Avengers Doomsday) పై పడింది. ఇటీవల విడుదలైన వీడియోతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరోసారి అవెంజర్స్ భారీ పోరాటంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మార్వెల్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తితో సోషల్ మీడియాలో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌త్యేకంగా, గ్రూపులుగా ఏర్ప‌డి మ‌రి చ‌ర్చ‌లు చేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హాలీవుడ్ సినిమాలకు ఊహించ‌ని ఆదరణ లభిస్తోంది. ‘ఆబ్సెషన్’, ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వంటి సినిమాలకు వచ్చిన స్పందనతో ఇప్పుడు అందరి దృష్టి ఈ మార్కెట్‌పై ఉంది. ఈ నేపథ్యంలో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్వెల్ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్ మేడ్ ఎడిట్స్, వీడియోలు వైరల్