తెలుగు రాష్ట్రాల్లో మసాల దినుసుల కల్తీ కేటుగాళ్లు.. హెచ్ ఫాస్ట్ సీరియస్ యాక్షన్
Actor ProfileCelebrity

తెలుగు రాష్ట్రాల్లో మసాల దినుసుల కల్తీ కేటుగాళ్లు.. హెచ్ ఫాస్ట్ సీరియస్ యాక్షన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగు రాష్ట్రాల్లో మసాల దినుసుల కల్తీ కేటుగాళ్లు.. హెచ్ ఫాస్ట్ సీరియస్ యాక్షన్
Zee Telugu7 Dec 2026
తెలుగు రాష్ట్రాల్లో మసాల దినుసుల కల్తీ కేటుగాళ్లు.. హెచ్ ఫాస్ట్ సీరియస్ యాక్షన్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Masala Mafia: హైదరాబాద్ మహానగర పరిసరాల్లో కల్తీ ఆహార పదార్థాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నగర ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిత్యావసర వస్తువుల్లోనూ, మసాలా దినుసుల్లోనూ కల్తీ రాజ్యమేలుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ విభాగం బృందం కల్తీ కేటుగాళ్ల ఆట కట్టించారు. హైదరాబాద్ పరిసరాల్లోని కిరాణా దుకాణాలకు సరఫరా అవుతున్న మసాలా దినుసులు, నిత్యావసరాలు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎక్కడ తయారు చేస్తున్నారనే అంశాలపై నిఘాపెట్టారు. బాలాపూర్, మైలార్ దేవ్ పల్లిలో నకిలీ మసాల గోడౌన్స్.. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్‌ హెచ్-ఫాస్ట్ బృందం, జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా అధికారులతో కలిసి హైదరాబాద్ వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ గోడవున్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కల్తీకి వాడుతున్న పదార్థాల రంగులు, మెరుపు కోసం ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ రంగులు, పారిశ్రామిక రంగులను గుర్తించి వాటిని సీజ్ చేశారు. మసాలా దినుసులు నాణ్యంగా ఉన్నట్లు మెరిసేందుకు షైనింగ్ పౌడర్ , రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నట్లు గుర్తించారు. మసాలా దినుసుల్లో రసాయన కల్తీ పదార్థాల వల్ల క్యాన్సర్, కాలేయం, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదముందని పోలీసు అధికారులు హెచ్చరించారు. కల్తీ మసాలా దినుసుల తయారీ స్థావరాల్లో తనిఖీలు.. ఒక ప్రాసెసింగ్ యూనిట్లో నకిలీ ఆవాల నిల్వలను వాటి రూపాన్ని, బరువును, పరిమాణాన్ని కృత్రిమంగా పెంచడానికి ఫ్యాబ్రిక్ డై, టాల్కమ్ పౌడర్ ,నూనె కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇతర యూనిట్లలో లవంగాలు, షాజీరా వంటి

త ల గ ర ష ట ర ల ల మస ల ద న స ల కల త క ట గ ళ ల హ చ ఫ స ట స ర యస య క షన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in