తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇక
Actor ProfilePolitician

తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చు
Asianet News Telugu14 Dec 2026
తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విమానయాన రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు పైలట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రాలు యువతకు అత్యున్నత స్థాయి పైలట్ శిక్షణను అందించడానికి తోడ్పడతాయి. తద్వారా వారు దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలలో సుస్థిరమైన ఉద్యోగాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా ఇది రాష్ట్రంలోని వేలాది మంది యువతకు మెరుగైన భవిష్యత్తును నిర్మించడంలో గణనీయంగా సహాయపడుతుంది. ఈ చర్య రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ కే చెందిన టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్డిఏ ప్రభుత్వం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో సొంత రాష్ట్రం ఏపీని విమానయాన రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించారు... ఇటీవలే ప్రధాని మోదీ చేతులమీదుగా ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ విమానాశ్రయం రాకతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి... భవిష్యత్ లో మరింత డెవలప్మెంట్ జరిగే అవకాశాలున్నాయి. అయితే కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతాన్నే కాదు ఏపీలో విమానయాన రంగ సేవలను విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఆరు కొత్త పైలట్ శిక్షణా కేంద్రాల (ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) ఏర్పాటుకు సిద్దమయ్యాయి. కర్నూల్, కడప, రాజమండ్రి విమానాశ్రయాల్లో ఈ పైలట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కర్నూల్ విమానాశ్రయం ఆంధ్ర ప్రదేశ్ విమానాశ్రయాల డెవలప్మెంట్ సంస్థ (APADCL) నిర్వహణలో ఉంది. ఇక్కడ ఇప్పటికే ఓ పైలట్ శిక్షణా కేంద్రం రెడీ అయ్యింది... దీనిని ఆగస్ట్ 22న ప్రారంభించనున్నారు. ఇక్కడే మరో పైలట్ శిక్షణా కేంద్రాన్ని ఈ డిసెంబర్ లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పరిధిలోని రాజమండ్రి, కడప విమానాశ్రయాల్లో రెండేసి చొప్పున నాలుగు పైలట్ శిక్షణా

త ల గ య వతక లక క ఛ న స ఇక Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in