తెలంగాణ రైతులకు శుభవార్త.. మళ్లీ అకౌంట్ లలోకి డబ్బులు
Actor ProfilePolitician

తెలంగాణ రైతులకు శుభవార్త.. మళ్లీ అకౌంట్ లలోకి డబ్బులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ రైతులకు శుభవార్త.. మళ్లీ అకౌంట్ లలోకి డబ్బులు
Samayam Telugu19 Oct 2026
తెలంగాణ రైతులకు శుభవార్త.. మళ్లీ అకౌంట్ లలోకి డబ్బులు

తెలంగాణ రైతులకు శుభవార్త.. తుది విడత రైతుభరోసా సాయం అకౌంట్‌లలో జమకానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవాళ ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాదసభలో తుదివిడత రూ.1009 కోట్లు రైతుల బ్యాంక్ అకౌంట్‌లలోకి విడుదల చేయనున్నారు. గత నెల 30న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించిన సభలో రైతు భరోసా తొలివిడత సాయం అందించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల వరకు జమ చేస్తామని చెప్పారు. తొలిరోజు రూ.878 కోట్లు విడుదల చేశారు.. రెండెకరాల వరకు ఉన్న రైతులకు ఈ సాయం అందించారు. అనంతరం 3,4,5,6,7 ఎకరాల వరకు ప్రభుత్వం సాయం అందించింది.. ఇలా బుధవారం వరకు మొత్తం రూ.7750.45 కోట్లను రైతుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేశారు. ఇవాళ 9 నుంచి 54 ఎకరాలకు సంబంధించిన అందించే సాయం రూ.1009 కోట్లు కలిపి మొత్తం సాయం రూ.8759 కోట్లకు చేరుతుంది. మొత్తం 1.45 కోట్ల ఎకరాల మేరకు భూములున్న 74 లక్షల మంది రైతులకు సాయం అందింది. రైతు భరోసా కోసం కొత్తగా నమోదయ్యే వారికి, సాంకేతిక కారణాలతో సాయం నిలిచిన వారికి తర్వాత నిధులు విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా రూ.9 వేల కోట్ల సాయం రైతుభరోసా కింద అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్న పార్టీల మల్లీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంని.. విత్తనం దశ నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. దేశంలోనే 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతు ఆశీర్వాద సభ ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్పే నేతలకు లెక్కలతో సహా బదులిస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా

త ల గ ణ ర త లక శ భవ ర త మళ ల అక ట లల క డబ బ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in