తెలంగాణా పోలీసులకు కొత్త సవాళ్లు
Actor ProfilePolitician

తెలంగాణా పోలీసులకు కొత్త సవాళ్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణా పోలీసులకు కొత్త సవాళ్లు, గతేడాది రూ.1700కోట్ల మోసం
Oneindia Telugu26 Nov 2026
తెలంగాణా పోలీసులకు కొత్త సవాళ్లు, గతేడాది రూ.1700కోట్ల మోసం

తెలంగాణా పోలీసులు ఇప్పుడు అతిపెద్ద సవాల్ ను ఎదుర్కొంటున్నారు. ఊహించని విధంగా శాంతి భద్రతలను పరిరక్షించటం కంటే అతి పెద్ద సమస్య పోలీసింగ్ కు సవాల్ గా మారుతుంది. ఒకప్పుడు నక్సలిజం పోలీసింగ్‌లో అతిపెద్ద సవాలైతే, ఇప్పుడు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలు, రోడ్డు భద్రత ప్రధానసవాళ్లుగా మారాయని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. పోలీసింగ్‌లో సాంకేతికత ఎంత కీలకమైనా మౌలిక పోలీసింగ్‌ను విస్మరించరాదని అధికారులకు సూచించారు.సైబర్ మోసాలతో గతేడాది రూ.1,700 కోట్ల నష్టంగత ఏడాది తెలంగాణలో సైబర్ నేరాల వల్ల ప్రజలు సుమారు రూ.1,700 కోట్లు కోల్పోయారని డీజీపీ వెల్లడించారు. మోసపోయిన వెంటనే ఫిర్యాదు చేయకపోవడం వల్ల డబ్బు రికవరీ అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పారు. అధిక లాభాల పేరుతో జరిగే పెట్టుబడి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణలో ప్రధానమంత్రి ప్రగతి సమీక్షలో తెలంగాణకు దేశంలోనే తొలి స్థానం లభించిందని డీజీపీ తెలిపారు.మౌలిక పోలీసింగ్‌కే ప్రాధాన్యం సాంకేతికత పోలీసింగ్‌కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. డీసీపీలు, ఏసీపీలు, డీఎస్పీలు క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయం గడుపుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.యువత, చిన్నారులను లక్ష్యంగా డ్రగ్స్.. చాక్లెట్లు రూపంలో చిన్నారులను మాదకద్రవ్యాలకు అలవాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవి ఆందోళనకరమని డీజీపీ అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ నివారణలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్రగ్స్ పైన కూడా ఉక్కుపాదం మోపేందుకు పని చేస్తున్నాం అన్నారు.హైడ్రాలో ఉద్యోగాలకు ఫిజికల్ టెస్టులు ఆగస్టు 11 వరకు పొడిగింపు!రైళ్లలో వచ్చి నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలుబీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చి వరంగల్, కాజీపేట కేంద్రంగా చైన్‌స్నాచింగ్, బైక్ చోరీలకు పాల్పడి వెంటనే వెళ్లిపోతున్న