తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 22
Actor ProfilePolitician

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 22

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 22-ఏ భూములకు విముక్తి, సన్న వడ్లకు బోనస్
AP7AM21 Dec 2026
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 22-ఏ భూములకు విముక్తి, సన్న వడ్లకు బోనస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 22-ఏ జాబితాలోని వివాదరహిత భూములకు విముక్తి కల్పించడం, సన్నరకం వడ్లకు బోనస్ ప్రకటించడం, హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడం వంటి ప్రధాన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.రిజిస్ట్రేషన్ల చట్టంలోని 22-ఏ నిషేధిత జాబితాలో పొరపాటున చేర్చిన, ఎలాంటి వివాదాలు లేని ప్రైవేట్ ఆస్తులను యుద్ధప్రాతిపదికన తొలగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కోర్టు కేసులు లేని ప్రభుత్వేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రార్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ఎవరి భూమినీ ప్రభుత్వం తీసుకోవాలని భావించడం లేదని, ఏవైనా సమస్యలుంటే తన వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, వాటిపై తక్షణమే స్పందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.రైతుల ప్రయోజనం దృష్ట్యా, ఈ ఏడాది నుండి ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్నరకం వరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను (మద్దతు ధరకు అదనంగా) చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసిందని వివరించారు. మరోవైపు, సివిల్ సప్లైస్ వద్ద మిగులుగా ఉన్న 17.54 లక్షల టన్నుల ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,389 కనీస ధరతో ఈ-వేలం వేయాలని కేబినెట్ నిర్ణయించింది.హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చాలన్న సంకల్పంతో, రూ.200 కోట్ల కేటాయింపుతో 'తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్'కు కేబినెట్ ఆమోద ముద్ర

త ల గ ణ క బ న ట క లక న ర ణయ ల 22 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in