తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం
Actor ProfilePolitician

తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
స్నేహితుడి నంబర్ తో మెస్సేజ్.. ఓపెన్ చేయగానే రూ.4.15 లక్షలు మాయం
Andhra Jyothy23 Dec 2026
స్నేహితుడి నంబర్ తో మెస్సేజ్.. ఓపెన్ చేయగానే రూ.4.15 లక్షలు మాయం

జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపుతోంది. స్నేహితుడి నంబర్‌తో వచ్చిన ఓ మెస్సేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే దాదాపు నాలుగు లక్షల నగదు మాయమవడం సంచలనం సృష్టిస్తోంది. జగిత్యాల, ఆగస్టు 15: జిల్లాలో సైబర్

నెలాఖరులోగా మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి
Andhra Jyothy23 Dec 2026
నెలాఖరులోగా మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి

రాజీవ్ లింక్ కెనాల్‌కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి

తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం
Andhra Jyothy22 Dec 2026
తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం

సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు 15: సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని.. తలసరి ఆదాయంలో టాప్‌లో ఉన్నామన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని నిర్ణయించామని తెలిపారు. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి.. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టామన్నారు. రైతు భరోసా కింద రూ.36వేల కోట్లు పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. అలాగే, రైతు సంక్షేమం కోసం రూ.లక్షా 70వేల కోట్లు, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని వివరించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సృష్టించిందని తెలిపారు. కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. వ్యవసాయంతో పాటు ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందజేశామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని,2 విడతల్లో 5.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందించనున్నామని తెలియజేశారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన జరిగిందని.. తెలంగాణ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణనలో కులగణన చేర్చిందని తెలిపారు. కొత్తగా 2.50లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. సినీ కార్మికుల సంక్షేమం