తెలంగాణలో సెక్షన్ 22
Actor ProfilePolitician

తెలంగాణలో సెక్షన్ 22

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో సెక్షన్ 22 పై రాహుల్ కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు
Andhra Jyothy19 Jan 2027
తెలంగాణలో సెక్షన్ 22 పై రాహుల్ కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని.. ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడటానికి కాదని వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో 30 శాతం వసూళ్ల రాకెట్ నడుస్తోందని, నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% కమీషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ హరీశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. యాదాద్రి జిల్లాలో 40వేల ఎకరాలను 22A లో పెట్టారని నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి.. రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని యజమానులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైనా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి. ఈ

త ల గ ణల స క షన 22 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in