
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువు ముగిసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటైజేషన్ దశ ఆగస్టు 10 తో పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 78.26 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఈ ప్రక్రియలో కోటికి పైగా ఓటర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. 73.52 లక్షల ఓటర్లు అంటే 21.5 శాతానికి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరగకపోవడంతో ఈ ఓట్లన్నీ పూర్తిగా తొలగిపోనున్నట్లు సమాచారం.కొత్త పింఛన్లపై కొత్త అప్డేట్..మొదట ఇచ్చేది వారికే,మొదలైన దరఖాస్తుల ప్రక్రియ!అలాగే ఓట్లలో తేడాలున్న అనామలీస్ జాబితాలో మరో 61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక వీటిలో కూడా ఎక్కువ శాతం ఓట్లు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. వీటితోపాటు 2002 కు సంబంధించిన అన్ మ్యాపింగ్ ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓటర్లకు ఆగస్టు 17 తర్వాత నోటీసులు అందిస్తారు. ఇలా చూసుకుంటే మొత్తంగా కోటికిపైగా ఓట్లను తొలగించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇక రాష్ట్రంలో తొలగిపోనున్న ఓట్లలో ఎక్కువ భాగం గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలోనే నమోదయ్యాయి. ఇక్కడే దాదాపు 43 లక్షల ఓట్లు ఔట్ అయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్- మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే అందులో 71.05 లక్షల మంది మాత్రమే బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మిగతా 43.09 లక్షల మంది ఓట్లు తొలిగిపోయినట్లుగానే భావించాల్సి ఉంటుంది.తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. సర్ గడువు మరోసారి పొడిగింపుమరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. సోమవారం సాయంత్రానికి 2.64 కోట్ల మంది అంటే 78.26 శాతం ఓటర్ల పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రమే పూర్తయింది. మిగిలిన 74 లక్షల మంది ఓటర్లు తమ నింపిన పత్రాలను బీఎల్