తెలంగాణలో బీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ స్పెషల్ ఆపరేషన్
Actor ProfilePolitician

తెలంగాణలో బీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ స్పెషల్ ఆపరేషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో బీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ స్పెషల్ ఆపరేషన్
Telugu Times25 Nov 2026
తెలంగాణలో బీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ స్పెషల్ ఆపరేషన్

తెలంగాణలో సంచలనాలు సృష్టించేందుకు బీజేపీ పదునైన వ్యూహానికి పదును పెట్టింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఒక కీలక ఉన్నత స్థాయి భేటీలో, తెలంగాణ కమలనాథులకు పార్టీ అధిష్ఠానం అత్యంత స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, విపక్షంలోకి వెళ్లాక తీవ్రమైన సవాళ్లతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీని సంపూర్ణంగా ఆక్రమించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గులాబీ పార్టీ నైతిక ధైర్యం దెబ్బతీసి, తెలంగాణలో ఇకపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోరాటం సాగాలని దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు పార్టీ కేడర్ పనిచేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ ఎక్కడైతే వెనకబడుతోందో, ఆ ప్రతికూలతనే తమ రాజకీయ అవకాశంగా మలుచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ప్రజాపోరాటాల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి మైలేజ్ దక్కకుండా చెక్ పెడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక నిజమైన విపక్షం తమదేనని నిరూపించుకోవాలని భావిస్తోంది. విద్యార్థులు, రైతులు, చేతివృత్తుల వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ఆరు గ్యారెంటీలు, రైతు రుణాలు, నిరుద్యోగ భృతి, మహిళా పథకాల అమలులో క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని క్షేత్రస్థాయి ఆందోళనల ద్వారా ఆయుధంగా మలచుకోవాలని అధిష్ఠానం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ హామీలు ఉత్తుత్తివేనని, ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ మోడల్ మాత్రమే శాశ్వతమని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన్ ఎజెండా. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీని వేధిస్తున్న అంతర్గత విభేదాలపై కేంద్ర నాయకత్వం సీరియస్ క్లాస్ తీసుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు తమ వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యాఖ్యలను పక్కనబెట్టి ఒకే టీమ్‌గా పనిచేయాలని స్పష్టం చేసింది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పిన నేతలు, సమష్టి నాయకత్వంతో పోరాడితేనే 2028లో అధికార పీఠం సాధ్యమవుతుందని మార్గదర్శనం చేశారు. కేవలం అర్బన్ ఏరియాలకే పరిమితం కాకుండా గ్రామ పంచాయతీల నుంచి పార్టీ నెట్‌వర్క్‌ను బలపరచాలని ఆదేశించారు. త్వరలో జరగబోయే గ్రేటర్

త ల గ ణల బ ఆర ఎస లక ష య గ బ జ ప స ప షల ఆపర షన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in