తెలంగాణలో సొంతింటి కలలు కంటున్న పట్టణ పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ (PMAY-U) 2.0 పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మరో 8,338 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఇటీవల దిల్లీలో నిర్వహించిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర నివేదికలు, ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సరికొత్త హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం రూ.125.07 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా పనులు ప్రారంభించడానికి తొలి విడత కింద రూ.50.02 కోట్లను తక్షణమే విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది.ఒకవైపు కొత్త ఇళ్లను మంజూరు చేస్తూనే.. మరోవైపు తెలంగాణలో పీఎంఏవై-యు, పీఎంఏవై-యు 2.0 పథకాల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగంలో, లబ్ధిదారులకు నిధులు చేరవేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని కేంద్రం వేలెత్తి చూపింది. పీఎంఏవై-యు మొదటి దశ కింద చేపట్టిన పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను రాబోయే సెప్టెంబరు 30 లోపు వంద శాతం పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఈ గడువు దాటిన తర్వాత జరిగే ఎటువంటి నిర్మాణ పనులకూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేదా సబ్సిడీలు అందబోవని కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.కేంద్ర నివేదికల ప్రకారం.. గతంలో పీఎంఏవై-యు 2.0 కింద మంజూరు చేసిన రూ.173.58 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.63.98 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. అలాగే ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం రూ.112.64 కోట్లు కేటాయించగా.. రాష్ట్రం అందులో రూ.54.79 కోట్లు మాత్రమే ఉపయోగించుకుంది. బడ్జెట్ నిధులు మూలన పడి ఉండటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిధుల వినియోగంలో వేగం పెంచాలని సూచించింది
Actor ProfilePolitician
తెలంగాణలోని పేదలకు కేంద్రం గుడ్ న్యూస్..
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•1 Oct 2026
తెలంగాణలోని పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. - 2.0 కింద ఇళ్లు మంజూరు