తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి
Actor ProfilePolitician

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి
Telugu Times25 Nov 2026
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేచింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఖాళీ కానున్న రెండు ముఖ్యమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకై ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెట్టాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి 29తో పదవీకాలం ముగియనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, తీన్మార్ మల్లన్న స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మూడో వారంలోనే ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉండటంతో, గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తు వేగవంతం చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుని తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ఖరారు చేసి, వారిని క్షేత్రస్థాయికి పంపాలని ఢిల్లీ వేదికగా జరిగిన సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయించారు. నల్గొండ స్థానం నుంచి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, కీలక ఉద్యోగ సంఘాల నేతలతో పాటు పీసీసీ నేత చనగాని దయాకర్ లతో సహా పలువురు ఆశావహులు టికెట్ రేసులో పోటీ పడుతున్నారు. ఇక హైదరాబాద్ స్థానంలోనూ గట్టి పోటీ నెలకొంది. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, పీసీసీ నేతలు గౌరి సతీశ్, హర్షవర్ధన్ రెడ్డిలతో పాటు భాగ్యనగరానికి చెందిన ఒక జిల్లా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్థానిక నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఓటర్లతో క్షేత్రస్థాయి అనుబంధం ఉన్నవారికే బి-ఫారమ్ ఇవ్వాలని పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. వరుస ఎన్నికల ఓటములతో ఆత్మరక్షణలో పడిన బీఆర్‌ఎస్ పార్టీ, ఈ పట్టభద్రుల ఎన్నికల ద్వారా పుంజుకోవాలని చూస్తోంది. విద్యావంతులు, ఉద్యోగులు

త ల గ ణల గ ర డ య య ట ఎమ మ ల స ఎన న కల హడ వ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in