తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. మధ్యలో ఆరు స్టేషన్లు
Actor ProfilePolitician

తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. మధ్యలో ఆరు స్టేషన్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. మధ్యలో ఆరు స్టేషన్లు, భద్రాచలం భక్తులకు ఇక ప్రయాణం ఈజీ
Samayam Telugu8 Oct 2026
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. మధ్యలో ఆరు స్టేషన్లు, భద్రాచలం భక్తులకు ఇక ప్రయాణం ఈజీ

తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే క్రమంలో డోర్నకల్‌ జంక్షన్‌-భద్రాచలం రోడ్‌ (కొత్తగూడెం) మధ్య త్వరలోనే రైల్వే డబుల్‌ లైను పనులు కార్యరూపం దాల్చనున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్‌ లైన్‌ మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల గూడ్స్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక్కడ కొత్తగా డబుల్‌ లైన్‌ నిర్మిస్తే సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు ప్రయాణికులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా భద్రాచలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఈ మార్గం ఎంతో సుగమం కానుంది. సికింద్రాబాద్, బలార్షా, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చే ప్రయాణికులు డోర్నకల్‌లో దిగి సులభంగా భద్రాచలం వెళ్లి రావడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబరులో గెజిట్‌ విడుదల చేయగా.. తాజాగా ఆ ప్రక్రియ పూర్తిగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి డబ్లింగ్‌ పనుల వైపునకు మళ్లింది.రైల్వే శాఖ 2008-09 రైల్వే బడ్జెట్‌లోనే డోర్నకల్‌-మణుగూరు మధ్య 104 కిలోమీటర్ల పొడవు డబుల్‌ లైన్, విద్యుద్దీకరణ సర్వేకు ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఐదేళ్ల పాటు ఏటా 24.53 శాతం మేర రేట్‌ ఆఫ్‌ రిటర్న్స్ వస్తుందనే నివేదిక ఆధారంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు రైల్వే బోర్డు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా డోర్నకల్‌-భద్రాచలం రోడ్‌ మధ్య ఉన్న 54.43 కిలోమీటర్ల పొడవు గల ట్రాక్‌ నిర్మాణానికి రూ.770.12 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని ప్రాధాన్యతను గుర్తించి ప్రస్తుత బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లను ప్రాథమికంగా కేటాయించింది. డోర్నకల్‌ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్‌ మధ్యలో పోచారం, కారేపల్లి, గాంధీపురం హాల్ట్, చీమలపహాడ్, తడికలపూడి, బేతంపూడి అనే ఆరు ముఖ్యమైన రైల్వేస్టేషన్లు ఉన్నాయి.ఈ డబుల్‌

త ల గ ణల క త త ర ల వ ల న మధ యల ఆర స ట షన ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in